ఈ జలాశయం నుంచి 94, 340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నీటి విడుదలను పెంచనున్నట్లు తెలిపారు. జలాశయం నీటి మట్టం 517.96 మీటర్లు (పూర్తిస్థాయి 519.60)గా నమోదైంది. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు నారాయణపుర జలాశయం నుంచి 1,79,060 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
తుంగభద్రకు లక్ష క్యూసెక్కులు..
హొసపేటె, న్యూస్‌టుడే: తుంగభద్రకు వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు సుమారు లక్ష క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయంలో ఒకేరోజు సుమారు 6 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయి.