Allu Arvind, Sukumar met governor : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" సినిమా చూడాలని తెలంగాణ గవర్నర్ తమిళిసైని ఆ చిత్ర బృందం ఆహ్వానించింది. ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ వెల్లడించారు. గవర్నర్‌ను నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్ బుధవారం కలిశారు. "పుష్ప" చిత్రాన్ని వీక్షించాలని గవర్నర్ తమిళిసైని కోరారు.
ఓటీటీ ఎప్పుడంటే?
Pushpa OTT: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో రిలీజ్ కానుంది. సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
కలెక్షన్లు ఇలా..
Pushpa Movie: తెలుగు సినిమాల కలెక్షన్లను హిందీ సినిమాలు కూడా అందుకోలేకపోతున్నాయని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ వ్యాఖ్యానించారు. అందుకు అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమానే ఉదాహరణగా చూపించారు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన 'పుష్ప' చిత్రం.. డిసెంబర్ 17న పాన్ ఇండియాగా మూవీగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
అంతేకాదు.. బాలీవుడ్‌లో ఈ చిత్రంతో.. బన్నీకి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు సినిమాపై, బన్నీపై ప్రశంసలు కురిపించగా.. ఇటీవలే కరణ్ జోహార్ కూడా కొనియాడారు. బన్నీ స్టార్‌డమ్‌తోనే హిందీ 'పుష్ప'కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని అన్నారు. బన్నీకి బాలీవుడ్‌లో ఆ స్టార్‌డమ్ రావడానికి గల కారణాన్ని కూడా కరణ్ వివరించారు.
ఇదీ చదవండి:OTT Release Movies: 'అఖండ', 'పుష్ప'.. ఓటీటీ విడుదల అప్పుడే!