ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైల్వే కేటాయింపుల్లోనూ మొండిచెయ్యే... అధికార పార్టీ ఎంపీల నుంచి ఒత్తిళ్లు లేకపోవడమే కారణం! - AP railway projects in budget

AP railway projects in budget: రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులోనూ ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ ఎంపీల నుంచి పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడంతో తాజా బడ్జెట్‌లోనూ ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపిందన్న విమర్శలున్నాయి. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైలు మార్గానికి రూ.వెయ్యి మాత్రమే కేటాయించడం... ఏపీపై కేంద్రం వైఖరికి అద్దం పట్టింది.

Union Budget 2022
Union Budget 2022

By

Published : Feb 3, 2022, 5:04 AM IST

AP railway projects in budget: రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులోనూ ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ ఎంపీల నుంచి పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడంతో తాజా బడ్జెట్‌లోనూ ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపిందన్న విమర్శలున్నాయి. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైలు మార్గానికి రూ.వెయ్యి మాత్రమే కేటాయించడం... అమరావతిపై కేంద్రం వైఖరికి అద్దం పట్టింది. ఈ లైను అంచనా వ్యయం రూ.2,679 కోట్లు కాగా, గత రెండు బడ్జెట్లలోనూ కేంద్ర ప్రభుత్వం రూ.వెయ్యి చొప్పునే కేటాయించింది. ఈసారీ అదేతీరు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రెండు మూడు ప్రాజెక్టులకు మాత్రం మూలధన, ఈబీఆర్‌ (బడ్జెటేతర వనరుల సమీకరణ) కేటాయింపులు కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. జోన్లవారీ బడ్జెట్‌ కేటాయింపులపై రైల్వేశాఖ బుధవారం రాత్రి ‘పింక్‌ బుక్‌’ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం రైల్వే ప్రాజెక్టులకు మూలధన కేటాయింపులు సుమారు రూ.1231.5 కోట్లే ఉండగా, ఈబీఆర్‌ కింద రూ.2,163 కోట్లు కేటాయించింది. ‘డిపాజిట్‌’ కేటగిరీలో రూ.3,433 కోట్లు చూపించింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న కొత్త లైన్లు, రెండు, మూడో లైన్ల పనులు 33 ఉన్నాయి. ఈ మొత్తం లైన్ల పొడవు 5,706 కి.మీ.లు. ఈ మొత్తం ప్రాజెక్టుల అంచనా విలువ రూ.63,731 కోట్లు.

రూ.వెయ్యితో సరి...!

  • రాష్ట్రంలోని చాలా రైల్వే లైన్లకు ఈ బడ్జెట్‌లో మూలధన కేటాయింపుల్ని రూ.వెయ్యికే పరిమితం చేసింది. వాటిలో మాచర్ల-నల్గొండ, కాకినాడ-పిఠాపురం, కోటిపల్లి-నరసాపురం, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం, కడప-బెంగళూరు, గూడూరు-దుగరాజపట్నం, భద్రాచలం-కొవ్వూరు, కొండపల్లి-కొత్తగూడెం రైల్వేలైన్లు ఉన్నాయి.
  • రైల్వేశాఖ, రాష్ట్రప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు మూలధన కేటాయింపుల కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈబీఆర్‌ కింద రూ.150 కోట్లు, డిపాజిట్‌ కేటగిరీలో రూ.1,351 కోట్లు చూపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన వాటా.

చెప్పదగ్గ కేటాయింపులు ఇవే..

  • ఖాజీపేట-విజయవాడ మూడోలైన్‌ విద్యుదీకరణకు రూ.342 కోట్ల మూలధన కేటాయింపులు, రూ.250 కోట్లు ఈబీఆర్‌ కేటాయింపులు చేసింది.
  • విజయవాడ-గూడూరు మూడోలైను నిర్మాణానికి ఈబీఆర్‌ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.
  • గుత్తి-ధర్మవరం డబ్లింగ్‌కి రూ.80 కోట్ల మూలధన, రూ.20 కోట్ల ఈబీఆర్‌ కేటాయింపులు చేసింది.
  • విజయవాడ, ఖాజీపేట రెండుచోట్లా బైపాస్‌ లైన్లకు మూలధనం కింద రూ.173 కోట్లు, ఈబీఆర్‌ కింద రూ.179 కోట్లు కేటాయించింది.
  • గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్‌కి మూలధనం కింద రూ.372 కోట్లు, ఈబీఆర్‌ కింద రూ.431 కోట్లు కేటాయించింది.
  • రేణిగుంట, వాడి, గుత్తి బైపాస్‌ లైన్లకు మూలధనం కింద రూ.16 కోట్లు, ఈబీఆర్‌ కింద రూ.38 కోట్లు ఇచ్చింది.

‘దక్షిణ కోస్తా’ జోన్‌కు మళ్లీ నిరాశే..

విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణకోస్తా (సౌత్‌ కోస్టు) రైల్వేజోన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. జోన్‌ నిర్వహణకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. రాయగడ డివిజన్‌ నిర్వహణకు రూ.40 లక్షలు కేటాయించినట్లు మాత్రమే చూపించారు. విశాఖలో జోన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం అవసరం. నిర్మాణానికి రూ.111 కోట్లు అవుతుంది.

చెప్పదగ్గ కేటాయింపులు ఇవే..

  • ఖాజీపేట-విజయవాడ మూడోలైన్‌ విద్యుదీకరణకు రూ.342 కోట్ల మూలధన కేటాయింపులు, రూ.250 కోట్లు ఈబీఆర్‌ కేటాయింపులు చేసింది.
  • విజయవాడ-గూడూరు మూడోలైను నిర్మాణానికి ఈబీఆర్‌ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.
  • గుత్తి-ధర్మవరం డబ్లింగ్‌కి రూ.80 కోట్ల మూలధన, రూ.20 కోట్ల ఈబీఆర్‌ కేటాయింపులు చేసింది.
  • విజయవాడ, ఖాజీపేట రెండుచోట్లా బైపాస్‌ లైన్లకు మూలధనం కింద రూ.173 కోట్లు, ఈబీఆర్‌ కింద రూ.179 కోట్లు కేటాయించింది.
  • గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్‌కి మూలధనం కింద రూ.372 కోట్లు, ఈబీఆర్‌ కింద రూ.431 కోట్లు కేటాయించింది.
  • రేణిగుంట, వాడి, గుత్తి బైపాస్‌ లైన్లకు మూలధనం కింద రూ.16 కోట్లు, ఈబీఆర్‌ కింద రూ.38 కోట్లు ఇచ్చింది.

ఇదీ చదవండి:టార్గెట్ దిల్లీ.. ముగ్గురు ముఖ్యమంత్రుల సరికొత్త రాజకీయం!

ABOUT THE AUTHOR

...view details