ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం... ఆందోళన వద్దు' - carona virus pi ala nani

కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఆస్పత్రుల్లో ముందస్తుగా ప్రత్యేక గదులు, మందులు సిద్ధం చేశామన్నారు.

alla nani on carona virus
కరోనా వైరస్​పై ఆళ్ల నాని

By

Published : Mar 3, 2020, 5:57 PM IST

కరోనా వైరస్​పై ఆళ్ల నాని

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రానికి ముప్పు వాటిల్లకుండా​ రాష్ట్ర వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని ఆ శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ముందస్తుగా ప్రత్యేక గదులు, మందులు సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కాలేదని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details