అమరావతి అసైన్డ్ భూములపై దళిత వ్యక్తి కాకపోతే ఫిర్యాదు చేయకూడదా అని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. దళితులకు అన్యాయం జరిగితే.. వారి తరుఫున ఎవరైనా అట్రాసిటీ కేసు పెట్టవచ్చన్నారు. అమరావతి భూముల విషయంలో సీఐడీ విచారణకు ఆళ్ల రామకృష్ణా రెడ్డి హాజరయ్యారు. తన దగ్గర ఉన్న వివరాలను అధికారులకు అందజేసినట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో దళిత రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని సీఐడీకి తెలిపినట్లు ఆయన వెల్లడించారు.
దోషులను గుర్తించి శిక్ష పడేలా చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే
అమరావతి అసైన్డ్ భూముల కేసులో దోషుల్ని గుర్తించి శిక్ష పడేలా చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. అమరావతి భూముల విషయంలో సీఐడీ విచారణకు ఆళ్ల రామకృష్ణా రెడ్డి హాజరయ్యారు. తన దగ్గర ఉన్న వివరాలను అధికారులకు అందజేసినట్లు తెలిపారు.
alla nani on amaravathi assigned lands case
ఈ వ్యవహారంలో మున్సిపల్ శాఖకు సంబంధం ఉందన్న కారణంతో మాజీ మంత్రి నారాయణకు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. దోషుల్ని గుర్తించి శిక్ష పడేలా చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే అధికారులకు సహకరించాలని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ.. హై కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్
Last Updated : Mar 18, 2021, 3:53 PM IST