ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై నేడు గవర్నర్​ను కలవనున్న అఖిలపక్ష మహిళా ఐకాస - mp madhav nude video viral

All party women JAC.. హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్​ వీడియో విషయమై నేడు గవర్నర్​ బిశ్వభూషణ్​ను అఖిలపక్ష మహిళా ఐకాస కలవనుంది. వీడియో వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో పాటు.. ఎస్పీ వ్యాఖ్యలను కూడా గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

WOMEN IKASA
WOMEN IKASA

By

Published : Aug 12, 2022, 4:04 PM IST

MP Gorantla Video Viral issue..ఈరోజు సాయంత్రం రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్​ను కలవనున్నట్లు అఖిలపక్ష మహిళా ఐకాస సంఘం తెలిపింది. హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది. ఎస్పీ ఫకీరప్ప నిర్వాకాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది మహిళా ఐకాస సంఘం ఆరోపించింది. నిజాలు తేల్చేందుకు విశేషాధికారాలు వినియోగించాలని కోరతామని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్లున్న వీడియో ఒకటి నాలుగో (గురువారం) తేదీ రాష్ట్రంలో కలకలం రేపింది. ఉదయం 8 గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ఈ వీడియో.. కొద్దిసేపటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ మాధవ్‌ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడటాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను మరో ఫోన్‌తో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు రాత్రి (బుధవారం) ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో తొలుత ఈ వీడియో వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాసేపటికి ట్విటర్‌లోనూ కొంతమంది దాన్ని షేర్‌ చేశారు. గురువారం ఉదయం ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై గోరంట్ల మాధవ్‌ స్పందిస్తూ ఆ వీడియో నకిలీది అనీ, తాను జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను మార్ఫింగ్‌ చేశారని చెప్పారు.

ఎస్పీ ఏమన్నారంటే.. "వీడియో కాల్‌ విషయంపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ అభిమాని కొణతాల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 4వ తేదీన కేసు నమోదు చేశాం. అనంతరం చేపట్టిన దర్యాప్తులో భాగంగా.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో 3వ తేదీ అర్ధరాత్రివేళ 2 గంటల సమయంలో యూకేలో రిజిస్టర్‌ అయిన వొడా ఫోన్‌ నెంబర్‌తో మొదటగా.. ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఈ వీడియో షేర్ చేసినట్టు గుర్తించాం. సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఫోన్ నెంబర్ ఇంటర్నేషనల్‌ నెంబర్‌ కావడంతో.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. వొడాఫోన్‌ నుంచి నిందితుడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ఒరిజినల్‌ కాదు. ఒకరు మొబైల్‌లో చూస్తున్నప్పుడు.. దాన్ని మరొకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియోను చాలా సార్లు ఫార్వర్డ్‌ చేశారు. రీ-పోస్టు చేశారు. ఐ -టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో తొలిసారి పోస్టు చేసింది కూడా.. ఫార్వర్డ్‌ చేసిన వీడియోనే. అది ఒరిజినల్‌ వీడియో కాదు కాబట్టి.. అది మార్ఫింగ్‌ చేశారా? లేదా? అనేది తేల్చలేకపోతున్నాం.

ఒరిజినల్‌ వీడియో దొరికే వరకు.. దాన్ని మొదట పోస్టు చేసిన వ్యక్తి దొరికే వరకు.. ఈ విషయాన్ని నిర్ధారించలేము. ఒరిజినల్‌ వీడియో దొరికితేనే.. అది మార్ఫింగా? కాదా? అనేది చెప్పలేం. సోషల్‌ మీడియాలో చూస్తున్న వీడియో ఒరిజినల్‌ కాదు. వీడియో అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నాం. ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వీడియోలో ఉన్నది ఎంపీ మాధవా? కాదా? అన్నది కూడా చెప్పలేం. వీడియోను యూకేలో ఎడిటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్‌ వీడియో ఎవరి వద్దైనా ఉంటే.. బాధితులు ఎవరైనా ముందుకొచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఒరిజినల్‌ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌ నివేదిక వస్తుంది" అని ఎస్పీ ఫకీరప్ప చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details