ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు - tread union leaders protested for vishaka steel plant

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... వివిధ పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. తక్షణమే ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

protest
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు

By

Published : Feb 26, 2021, 2:16 PM IST

ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని కోరుతూ.. ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కేంద్రం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.

గుంటూరు..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు శంకర్ విలాస్ కూడలి వద్ద కార్మిక సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. తక్షణమే ఉక్కు ప్రైవేటికరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. రోడ్డు పై బైఠాయించిన కార్మిక సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్​ చేసి అరుండల్ పేట స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ,ఎస్.ఎఫ్.ఐ సంఘాల నేతలు పాల్గొని కార్మిక సంఘాలకు మద్దతు తెలిపారు.

విశాఖ..

విశాఖ కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, కార్మిక సంఘాలు పాల్గొన్నారు. ఈ కారణంగా నగరంలో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. మరో వైపు ఉక్కు ప్రైవేటికరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని నిరసనకారులు వెల్లడించారు.

ఇదీ చదవండీ..'విశాఖ నగర అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక రూపొందించాలి'

ABOUT THE AUTHOR

...view details