ఎంసెట్‌తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును ఉన్నత విద్యామండలి జూన్ 15 వరకు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు బుధవారంతో ముగియనుంది. ఇప్పటివరకు ఎంసెట్‌కు 2,56,983, ఈసెట్‌కు 33,652, ఐ సెట్‌కు 51,791, పీజీఈసెట్‌కు 19,189, లా సెట్‌కు 10,358, ఎడ్ సెట్‌కు 7,760 దరఖాస్తులు వచ్చాయి.
పరీక్ష కేంద్రాల కేటాయింపునకు చిరునామాల సేకరణ
10వ తరగతి విద్యార్థుల నివాసాలకు సమీపంలో పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం వివరాలను జిల్లాలకు పంపించనుంది. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 60వేల మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ప్రైవేటు పాఠశాలల వివరాల కోసం విద్యార్థుల సమాచారాన్ని విద్యాధికారులకు పంపించి, చిరునామాలు తీసుకోనున్నారు. ప్రశ్నపత్రాల మార్పు అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.