మందుబాబులకు.. తెలంగాణ సర్కార్ షాక్.. - alcohol price hike
Alcohol Price Increase: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు 19వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాల్లో ఇవాళ్టి అమ్మకాలు పూర్తి కాగానే అబ్కారీ అధికారులు మద్యం సీజ్ చేయనున్నారు. నిల్వలు లెక్కించి రేపటి నుంచి.. పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. అయితే ఎంత మేర ధరలు పెరిగాయనే వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.