ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధర తక్కువ..కిక్కు ఎక్కవ..అందుకే తాగేస్తున్నారు! - మద్యానికి బదులు శానిటైజర్ల వాడకం

మత్తు కోసం మందుబాబులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మద్యానికి బదులు శానిటైజర్ తాగుతున్నారు. మద్యంతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుండటం, విరివిగా దొరుకుతుండటం వల్ల కూలీలు, చెత్త ఏరుకునేవారు శానిటైజర్లకు అలవాటుపడి ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు. గుంటూరు నగరంలో బహిరంగంగానే శానిటైజర్ల సేవనం సాగుతోంది.

alcohol addicts
alcohol addicts

By

Published : Nov 15, 2020, 4:14 AM IST

ధర తక్కువ..కిక్కు ఎక్కవ..అందుకే తాగేస్తున్నారు!

కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు .. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కరోనా కట్టడి కోసం ఉపయోగపడుతున్న ఈ శానిటైజర్లు.. కొందరు మందుబాబులకు మాత్రం మద్యానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. మద్యంతో పోలిస్తే చవకగ్గా దొరుకుతుండటంతో శానిటైజర్లను మత్తు కోసం వాడుతున్నారు. గుంటూరు నగరంలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లోనే శానిటైజర్లు తాగుతున్నారు. ఇటీవల ప్రభుత్వం చీఫ్ లిక్కర్ ధరల్ని తగ్గించినా.. శానిటైజర్లతో పోలిస్తే మద్యం ధర ఎక్కువగా ఉంది. అందుకే కూలీలు, చెత్త పేపర్లు ఏరుకునేవాళ్లు, బిచ్చగాళ్లు.. మత్తు కోసం శానిటైజర్లపై ఆధారపడుతున్నారు.

70 నుంచి 80శాతం...


సాధారణంగా బీరులో తొమ్మిది శాతం, మద్యంలో సుమారు 24.3 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. అదే శానిటైజర్‌లో అయితే 70 నుంచి 80శాతం వరకూ ఆల్కహాల్ ఉంటుంది. శానిటైజర్ల తయారీకి వాడే ఆల్కహాల్ ఎంతో ప్రమాదకరం. ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో శానిటైజర్ల తాగి కొందరు మరణించారు కూడా. శానిటైజర్ తయారీలో వాడే ఐసో ప్రొపైల్ ఆల్కహాల్.. తాగేందుకు పనికిరాదు. సరైన ప్రాసెసింగ్ లేని ఈ ఆల్కహాల్ తాగితే నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడంతో పాటు.. ప్రాణాలకూ ముప్పుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

కరోనా ప్రభావంతో శానిటైజర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దుకాణాలతో పాటు రోడ్డు పక్కన కూడా వీటిని విరివిరిగా అమ్ముతున్నారు. 40 రూపాయలకు 100 మిల్లీ లీటర్ల వరకూ లభిస్తోంది. మత్తు కోసం శానిటైజర్‌ తాగే వారిని గుర్తించి.. అడ్డుకట్ట వేయకపోతే.. గుంటూరులోనూ శానిటైజర్‌ మరణాలు నమోదయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ఇదీ చదవండి

పిఠాపురంలో అగ్నిప్రమాదం.. ఆహుతైన 1200 కోళ్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details