ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సందడిగా అలయ్​ బలయ్ వేడుక.. డప్పు వాయించి ఉత్సాహపరిచిన మెగాస్టార్ - Alai Balai celebrations at nampally grounds

Alai Balai celebrations at nampally : దసరా అనంతరం బండారు దత్తాత్రేయ కుటుంబం ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో జరుగుతున్న ఈ వేడుకలకు అన్ని పార్టీల నేతలు, కళాకారులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వేడుక కోసం నోరూరించే ఎన్నో తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు.

Alai Balai celebrations
Alai Balai celebrations

By

Published : Oct 6, 2022, 2:07 PM IST

Alai Balai celebrations at nampally grounds: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్‌ బలయ్‌ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్‌ బలయ్‌ దసరా సమ్మేళనం 2022 నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రముఖులు ఒక్కొక్కరిగా తరలివస్తున్నారు.

బండారు దత్తాత్రేయతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మెగాస్టార్ చిరంజీవి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, గరికపాటి నరసింహారావు, భాజపా నేతలు వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, సినీ నటుడు బాబూమోహన్, ఎమ్మెల్యే రఘునందనరావు, సంగీత దర్శకురాలు శ్రీలేఖ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కళాకారులతో కలిసి డప్పు వాయించి అందరిని ఉత్సాహపరిచారు. అంతకు ముందు వీహెచ్‌ కూడా కళాకారులతో డప్పు వాయించారు.

ఈ వేడుకకు తెలంగాణ, ఏపీ, కేరళ గవర్నర్లు డాక్టర్ తమిళసై సౌందర రాజన్, బిశ్వభూషణ్ హరిచందన్​ , ఆరిఫ్ ఖాన్​, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, భగవంత్ ఖుభా కూడా హాజరు కానున్నారు.

సందడిగా అలయ్​ బలయ్ వేడుక.. డప్పు వాయించి ఉత్సాహపరిచిన మెగాస్టార్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details