ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్షయ తృతీయ స్పెషల్.. ఈరోజు బంగారం కొంటున్నారా..? - బంగారం రేట్లు తాజా సమాచారం

Akshaya Tritiya 2022 : బంగారు ఆభరణాల దుకాణాలకు మరింత కళ తెచ్చే అక్షయ తృతీయ వచ్చేసింది. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మి ఇంటికి వస్తుందని జనం నమ్మకం. అందుకని స్వర్ణాభరణాల దుకాణాలకు పరుగులు పెడతారు. ఇప్పటికే ప్రత్యేక ఆఫర్లు, కొత్త కలెక్షన్లతో అతివలను ఆకర్షిస్తున్న షోరూంలు... పర్వదినం కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.

1
1

By

Published : May 3, 2022, 8:22 AM IST

Akshaya Tritiya 2022 : పర్వదినాలన్నింటిలోనూ అక్షయ తృతీయది ప్రత్యేక స్థానం. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలకు లోటు ఉందని, లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని మహిళలు భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు కొంచెంమైనా బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఇందుకోసం దుకాణాలు ముందుగానే ముస్తాబయ్యాయి. వివాహాలను దృష్టిలో ఉంచుకుని నయా కలెక్షన్లతో అతివలను ఆకర్షిస్తున్నాయి. అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులకు స్వాగతం పలుకుతున్నాయి. పండగ రోజున బంగారం కొనేందుకు ప్రీ బుకింగ్స్‌ సైతం అందిస్తుండటంతో.... రెండు, మూడు రోజుల ముందునుంచే బంగారం దుకాణాల్లో సందడి నెలకొంది.

ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్న వ్యాపారులు: గత రెండు నెలలుగా బంగారు ధరలు ఆశాజనకంగా ఉన్నాయని.. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ కూడా బాగుందని వ్యాపారులు చెబుతున్నారు. శుభకార్యాలు ఉంటే కాయిన్ల కన్నా నగలు కొనడం ఉత్తమమని సూచిస్తున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా వ్యాపారం తగ్గిందని... ఈసారి జనం బంగారం కొనేందుకు బాగానే వస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. వారిని ఆకర్షించేందుకు ఆఫర్లతో పాటు.. అక్షయ తృతీయ సెలెబ్రేషన్స్‌ పేరిట సందడి చేస్తున్నారు. మోడళ్లతో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ....వినియోగదారులను తమవైపు లాగుతున్నారు.

ఇదీ చదవండి:తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా...

ABOUT THE AUTHOR

...view details