ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్ - అక్బరుద్దీన్ సంచలన కమెంట్స్

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో ఎంఐఎం నిర్వహించిన బహిరంగ సభలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే హుస్సేన్‌సాగర్‌ కట్టపై ఉన్న సమాధులను కూల్చాలని తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

akbaruddin
akbaruddin

By

Published : Nov 25, 2020, 5:39 PM IST

అక్రమ కట్టడాలు కూల్చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం దమ్ముంటే హుస్సేన్‌సాగర్‌ కట్టపై ఉన్న సమాధులను కూల్చి వేయాలని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ అప్పట్లో 4,700 ఎకరాల్లో చెరువును నిర్మిస్తే ఆక్రమణలకు గురై ఇప్పుడు అది 700 ఎకరాలకు కుంచించుకు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెరువుల స్థలాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, దానిని కాపాడాల్సిన ప్రభుత్వం పేదలపై మాత్రం కన్నెర్ర చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న జీఎహెఎంసీ కార్యాలయం కూడా నాలాపైనే నిర్మించిందని ఆరోపించారు. ఎన్నికల్లో నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరు మాట్లాడటం లేదని విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్‌, కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని అక్బరుద్దీన్ ‌ఓవైసీ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details