ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరిట మోసాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని మంగళగిరిలో కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తన దృష్టికి వచ్చిందని అజేయ కల్లం ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లోను ఈ సమాచారాన్ని విస్తృతం చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన పేరిట మోసం చేస్తున్నారని డీజీపీకి అజేయ కల్లం ఫిర్యాదు - అజేయ కల్లం తాజా వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని తన పేరిట మోసాలకు పాల్పడుతున్నారని సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలో కొందరు వ్యక్తులు తన పేరు వాడుకుని విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని కోరారు.
Ajay kallam