ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు శనివారం తర్వాతే - ఉద్యోగుల జీతాలపై అజేయ్ కల్లం కామెంట్స్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు శనివారం తర్వాతేనని... ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం స్పష్టం చేశారు. చరిత్రలో తొలిసారి ద్రవ్యవినిమయ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందకపోవడం వల్లే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్‌ చేశారు. బిల్లు ఆమోదం పొందకపోవడానికి తెదేపానే కారణమని నిందించారు.

ajay kallam about govt employees salaries
ajay kallam about govt employees salaries

By

Published : Jul 2, 2020, 3:13 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ సలహాదారు అజేయకల్లం తెలిపారు. తొలిసారిగా సకాలంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోవడానికి.. మండలిలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడమే కారణమన్నారు. శనివారం నాటికి బిల్లుకు గవర్నర్‌ నుంచి ఆమోదం లభించే అవకాశం ఉందని- అంతవరకు ఉద్యోగులకు జీతాల చెల్లింపుతోపాటు ఇతర ఆర్థిక బిల్లులకు చెల్లింపు జరగబోవని చెప్పారు. మూడు నెలల క్రితం సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనందున ఆర్డినెన్స్‌ ద్వారా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల ఖర్చులు చేశామని.. గతనెల 16, 17 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఎంతో ముఖ్యమైన ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించనందునే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు ఈ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details