ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ajay Jain Fake Memo: అజయ్​జైన్ పేరుతో మెమో.. నకిలీదిగా నిర్ధరణ

Ajay Jain Fake Memo: అజయ్​జైన్ పేరుతో వెలువడిన నకిలీ మెమో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. సచివాలంలో మహిళా పోలీస్​, ఏఎన్​ఎం మినహా మిగిలిన ఉద్యోగులంతా ఏకరూప దుస్తులు ధరించాలని ప్రభుత్వం రూ.15 కోట్లు వెచ్చించింది. అయితే.. వీటినుంచి మినహాయింపు ఇస్తున్నట్లు జారీ అయిన మెమో చర్చనీయాంశమైంది. తీరా ఆరా తీస్తే ఇది నకిలీదిగా బయటపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Ajay Jain Fake Memo
అజయ్​జైన్ పేరుతో నకిలీ మెమో

By

Published : Mar 20, 2022, 8:19 AM IST

Ajay Jain Fake Memo : మహిళా పోలీస్​, ఏఎన్​ఎం మినహా మిగిలిన ఉద్యోగులకు ఏకరూప దుస్తుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్​ జైన్​ పేరుతో శనివారం వెలువడిన నకీలీ మెమో కలకలం సృష్టించింది.

సచివాలయాల్లోని ఉద్యోగులకు ఏకరూప దుస్తుల కోసం ప్రభుత్వం దాదాపు రూ.15 కోట్లు వెచ్చించింది. ఉద్యోగులు విధిగా వీటిని ధరించాలని అధికారుల నుంచి ఒత్తిడి తెస్తున్న దశలో వీటి నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు జారీ అయిన మెమో చర్చనీయాంశమైంది. దీనిపై అధికారులు ఆరా తీస్తే అది అజయ్​జైన్​ పేరుతో ఎవరో తయారు చేసిన నకిలీ మెమో అని బయటపడింది. దీనిపై అజయ్​జైన్​ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details