ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎయిర్​ఫోర్స్ శిక్షణా కేంద్రాలకు భూములు కేటాయించండి'

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఎయిర్​ఫోర్స్ అధికారులు భేటీ అయ్యారు. ఇండియన్ ఎయిర్​ఫోర్స్ ఏర్పాటు చేసే శిక్షణా కేంద్రాలకు భూములు కేటాయించాలని కోరారు. దీనికి సీఎస్ సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

airforce and navy officials met cs neelam sahni
airforce and navy officials met cs neelam sahni

By

Published : Feb 20, 2020, 12:03 AM IST

సీఎస్​తో ఎయిర్​ఫోర్స్, నేవీ అధికారులు భేటీ

రాష్ట్రంలోని సూర్యలంక, భోగాపురం, దొనకొండ తదితర ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేసే శిక్షణా కేంద్రాలకు తగిన భూములను కేటాయించాలని ఎయిర్ వైస్ మార్షల్ ప్రశాంత్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి విజ్ణప్తి చేశారు. ఈ మేరకు సూర్యలంక ఇండియన్ ఎయిర్ ఫోర్స్​స్టేషన్ సదరన్ ఎయిర్ కమాండ్, గ్రూప్ కెప్టెన్ ఎయిర్ వైస్ మార్షల్ ప్రశాంత్‌ నేతృత్వంలో ఎయిర్​ఫోర్స్ అధికారులు సచివాలయంలో సీఎస్​ను కలిశారు. ఇండియన్ ఎయిర్​ఫోర్స్ సూర్యలంక తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న శిక్షణా కేంద్రాలకు తగిన భూములు కేటాయించే అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎస్ స్పష్టం చేశారు. సూర్యలంక, దొనకొండలతో పాటు విజయవాడ, భోగాపురం విమానాశ్రయాలను ఆనుకుని ఏర్పాటు చేసే ఎయిర్ ఫోర్స్ కేంద్రాలకు తగిన భూములను నిర్దిష్ట ధరల ప్రకారం కేటాయించాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను సీఎస్‌ ఆదేశించారు.

మరోవైపు విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాప్ వైస్ అడ్మిరల్ ఎస్.ఎన్.ఘోర్మడేతో కూడిన అధికారుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యింది. తూర్పు నౌకాదళానికి వివిధ ప్రాంతాల్లో భూములు కేటాయించేందుకు తగిన స్థలాలను గుర్తించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్​ను, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే కోస్టల్ సెక్యూరిటీ, మెరైన్ పొల్యూషన్, ఏపీ మారిటైమ్ బోర్డు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. మార్చి నెలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న మిలాన్ - 2020 ఈవెంట్​కు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నౌకాదళ అధికారులు ఆహ్వానించారు.

ఇదీ చదవండి:

'గ్రానైట్ పరిశ్రమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details