ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS Congress: తెలంగాణ కాంగ్రెస్​కు మరో దెబ్బ.. దాసోజు రాజీనామా - tpcc

Dasoju Shravan Resign: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Dasoju
Dasoju

By

Published : Aug 5, 2022, 6:50 PM IST

Updated : Aug 5, 2022, 6:57 PM IST

Shravan Resign to Congress Party: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా ముందు ప్రకటించారు.

TPCC: తెలంగాణలో పీసీసీ వైఖరి పట్ల శ్రవణ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీజేఆర్‌ కుమార్తె విజయరెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆయన అలిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. శ్రవణ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు తెలియగానే ఆ పార్టీ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కలిసి దాసోజు ఇంటికి చేరుకున్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవద్దంటూ బుజ్జగించారు.

ఇదీ చదవండి:

Last Updated : Aug 5, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details