రాష్ట్రానికి పాడి కుండలాంటి అమరావతి విధ్వంసం వైకాపా నాశనానికి నాంది అని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. సీఎం జగన్ ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు. జగన్ తల్లి విజయమ్మ, ప్రజలు... రాజధాని మార్పు సహేతుకమైన నిర్ణయం కాదని తెలిపారంటూ పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
'సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి' - అమరావతిపై మాట్లాడిన ముప్పాళ్ల నాగేశ్వరరావు
అమరావతి విధ్వంసం వైకాపా నాశనానికి దారి తీస్తుందని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు