అమరావతిలో వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి.. కౌలు రైతులకూ రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కౌలు రైతులకు సంబంధించి మరో నెల సమయం పొడిగించామని వెల్లడించారు. రైతులకు మద్దతు ధర అంశంపై సమావేశంలో చర్చ జరిగిందన్న... కౌలు రైతులకు ఆర్థికసాయంపైనా చర్చించామని వివరించారు.
కౌలురైతులకూ రైతు భరోసా వర్తింపు: నాగిరెడ్డి - వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి
కౌలు రైతులకూ రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో చర్చించామని వెల్లడించారు.
![కౌలురైతులకూ రైతు భరోసా వర్తింపు: నాగిరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5101070-576-5101070-1574068079855.jpg)
నాగిరెడ్డి
TAGGED:
nagireddy press meet