ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ 1.13 కోట్ల ఎకరాలకు చేరిన సాగు, వ్యవసాయశాఖ తాజా నివేదిక - Monsoon Crops in Telangana

Monsoon Crops in Telangana తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్​లో పంటల సాగు విస్తీర్ణం 1.13 కోట్ల ఎకరాలను దాటిందని వ్యవసాయశాఖ తెలిపింది. జూన్‌ ఒకటి నుంచి బుధవారానికి సాగు కావాల్సిన సాధారణ విస్తీర్ణంకన్నా మరో 10 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొంది.

Monsoon Crops in Telangana
ఖరీఫ్‌ సీజన్​లో పంటల సాగు

By

Published : Aug 25, 2022, 8:24 PM IST

Monsoon Crops in Telangana: తెలంగాణలో ప్రస్తుత వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ పంటల సాగు విస్తీర్ణం 1.13 కోట్ల ఎకరాలను దాటింది. గత జూన్‌ ఒకటి నుంచి బుధవారానికి సాగు కావాల్సిన సాధారణ విస్తీర్ణంకన్నా మరో 10 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు వేసినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికిచ్చిన వారాంతపు నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 1.14 కోట్ల ఎకరాలకు పైగా సాగవగా ఈ సీజన్‌లో అంతకన్నా తక్కువగా ఉంది.

ప్రధాన పంట పత్తి 48.34 లక్షలు, వరి 45.69 లక్షలు, కంది 5.51 లక్షలు, మొక్కజొన్న 5.27 లక్షలు, సోయాచిక్కుడు 3.95 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. వరి తప్ప మరే పంట కూడా సాధారణంకన్నా ఎక్కువ విస్తీర్ణంలో వేయలేదని వ్యవసాయశాఖ తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌లో మొత్తం 1.23 కోట్ల ఎకరాలకు పైగా సాగు కావాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ఇంకా 10 లక్షల ఎకరాలు తక్కువగా ఉంది.

రెండు పురుగుమందులపై నిషేధం:పంటలపై తెగుళ్ల నియంత్రణకు చల్లుతున్న ప్రిజమ్‌ క్రాప్‌సైన్స్‌ కంపెనీ తయారుచేసి విక్రయిస్తున్న మోనోక్రోటోఫాస్‌ 36 శాతం ఎస్‌.ఎల్‌. (బ్యాచ్‌ నంబరు ‘పీసీఎస్‌/113/15’) పురుగుమందును, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీ తయారుచేసి విక్రయిస్తున్న అజాడిరక్టిన్‌ 1 శాతం ఈసీ (బ్యాచ్‌ నంబరు 2201-29) పురుగుమందును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు వ్యవసాయశాఖ బుధవారం తెలిపింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details