ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈటీవీ కథనానికి స్పందన.. కాంప్లెక్స్ ఎరువులు వినియోగించుకోవాలన్న వ్యవసాయశాఖ కమిషనర్ - ఏపీలో ఎరువుల వార్తలు

ఎరువుల కొరతపై ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ స్పందించారు. రబీ సీజన్ లో డీఏపీ, ఎంఓపీ ఎరువులు దొరక్కపోయినా రైతులు కాంప్లెక్సు ఎరువులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈటీవీ కథనానికి స్పందన
ఈటీవీ కథనానికి స్పందన

By

Published : Oct 26, 2021, 9:55 PM IST

డీఏపీ, పొటాష్ ఎరువుల కొరతపై ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ స్పందించారు. రబీ సీజన్​లో డీఏపీ, ఎంఓపీ ఎరువులు దొరక్కపోయినా రైతులు కాంప్లెక్సు ఎరువులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్​కుమార్ స్పష్టం చేశారు. రబీ సీజన్​లో ఎరువుల కొరత లేదని చెబుతూ ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. 2021-22 రబీ సీజన్​కు రాష్ట్రంలో 23.44 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు ఏపీలో అవసరమవుతాయని ప్రణాళిక వేసినట్లు ఆయన వివరించారు. అక్టోబరు 1 నుంచి 26 తేదీ నాటి వరకూ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువును సరఫరా చేశామని తెలిపారు. అలాగే రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాల, మార్క్ ఫెడ్ , ఇతర తయారీ దారుల గోదాముల్లో 5.65 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. 2021-22 రబీ సీజన్ లో ఆర్బీకేల ద్వారా 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. ఇప్పటి వరకూ 88 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు ఆర్బీకేల వద్ద గోదాముల్లో నిల్వ ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 25 వేల మెట్రిక్ టన్నుల ఎరువుల్ని రైతులు కొనుగోలు చేశారని వెల్లడించారు. డీఏపీ, ఎంఓపీ ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డీఏపీ, ఎఓపీ ఎరువులు అందుబాటులో లేకపోయినా కాంప్లెక్సు ఎరువులు వాడాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details