ఏపీ లోకాయుక్త కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. 'ఈ వ్యవహారంలో నిబంధనల సవరింపు ప్రక్రియ పూర్తయింది. పురోగతిపై అన్ని వివరాలను తదుపరి విచారణలో కోర్టుకు సమర్పిస్తామని' చెప్పారు. దీనిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వ్యాజ్యంలో ప్రతి వాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, లోకాయుక్త రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసింది.
LOKAYUKTHA: 'లోకాయుక్త కార్యాలయం తరలింపుపై చర్యలు తీసుకుంటున్నాం' - లోకాయుక్త కార్యాలయం తరలింపుపై చర్యలు
ఏపీ లోకాయుక్త కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. ఏపీ లోకాయుక్త హైదరాబాద్‌లో ఉండటంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదులు చేయడానికి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా తీసుకొని మంగళవారం విచారణ జరిపింది.

లోకాయుక్త పై హైకోర్టు
విచారణను ఆగస్టు 31 కి వాయిదా వేస్తూ ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. ఏపీ లోకాయుక్త హైదరాబాద్‌లో ఉండటంతో అక్కడికి వెళ్లి ఫిర్యాదులు చేయడానికి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా తీసుకొని మంగళవారం విచారణ జరిపింది.
ఇదీ చదవండి:
దేశంలో వ్యక్తిగత గోప్యతకు భద్రత ఉందా?
TAGGED:
లోకాయుక్త తాజా వార్తలు