ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల ముసాయిదాకు 'ఏజీ' అనుమతి తప్పనిసరి - AP Govt latest news

ప్రభుత్వం తీసుకునే విధాన పరమైన నిర్ణయాలు, ప్రభుత్వ పథకాల ముసాయిదాల జారీకి ఇక నుంచి అడ్వకేట్ జనరల్ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు జీవో నెంబరు 11ను జారీ చేస్తూ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఆదేశాలు ఇచ్చారు.

AG approval is mandatory for policy decisions
ఏజీ అనుమతి తప్పనిసరి

By

Published : Feb 9, 2021, 5:02 PM IST

ప్రభుత్వ ఉత్తర్వులు, విధాన పరమైన ముసాయిదా పత్రాలను జారీ చేసే ముందు అడ్వకేట్ జనరల్ పరిశీలనకు పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ విభాగాలూ ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాలని సూచనలు జారీ అయ్యాయి.

ప్రభుత్వం తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాలు, పథకాలు సాంకేతిక ఇబ్బందుల కారణంగా న్యాయ సమీక్షకు లోను కావాల్సి వస్తోందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజా ప్రయోజనాల కోసం విధానాలు రూపొందిస్తున్నా కోర్టుల్లో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోందని.. దీన్ని అరికట్టేందుకు ఏజీ కార్యాలయం నుంచి వాటిపై ముందస్తు అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం చేపట్టిన కొన్ని నిర్ణయాలు న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా అమలులో జాప్యాన్ని ఎదుర్కోంటున్నాయని... దీన్ని నివారించేందుకు అడ్వకేట్ జనరల్ ముందస్తు పరిశీలన అవసరమని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం... మంత్రిమండలి, న్యాయ విభాగం నుంచి అనుమతి వచ్చిన అనంతరం ముసాయిదా ప్రభుత్వ ఉత్తర్వు, ముసాయిదా విధాన పత్రాలను ఏజీకి పంపాల్సిందిగా సూచించారు. ముసాయిదా ఉత్తర్వులు, విధాన పత్రాలను ఏజీకి పంపేందుకు ఉద్దేశించి జీవో నెంబరు 11ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జారీ చేశారు.

ఇదీ చదవండి:షర్మిల పార్టీతో వైకాపాకు ఎలాంటి సంబంధం లేదు: సజ్జల

ABOUT THE AUTHOR

...view details