కొవిడ్-19 నివారణకు కృషి చేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదటి, రెండో దశ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో మూడో దశకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే.
నవంబర్‌లో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' మూడో దశ ట్రయల్స్ - COVAXIN vaccine latest news
17:20 October 23
ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. ఇందుకు డీసీజీఐ అనుమతించింది. మొదటి, రెండో దశ కలిపి మొత్తం 100 మంది వాలంటీర్లు ట్రయల్స్‌లో భాగస్వాములయ్యారని ఆ సంస్థ తెలిపింది.
జంతువులతో పాటు మనుషులపై జరిగిన మొదటి, రెండు దశల పరీక్షల ఫలితాలను అనుసరించి మూడో దశకు అనుమతులు మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 25వేలకు పైగా వాలంటీర్లతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. నవంబర్ మొదటి వారంలో కొవాగ్జిన్ మూడో దశ ట్రయిల్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్ తొలిదశలో 45 మందికి, రెండో దశలో 55 మందికి నిమ్స్‌లో టీకా ఇవ్వగా.. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని చెప్పారు. మొదటి, రెండో దశ కలిపి మొత్తం 100 మంది వాలంటీర్లు ఇందులో భాగస్వాములయ్యారన్నారు.
ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. దాదాపు ఆర్నెల్ల పాటు వాలంటీర్ల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. మూడో దశ పరీక్షల్లో భాగంగా నిమ్స్‌లో మరో 200 మందికి టీకా ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.
ఇదీ చదవండీ... ఆధార్ సాయంతోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ!