ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్రేక్​ తీసుకున్న వరుణుడు.. 18 తరువాత మళ్లీ భారీ వర్షాలు..! - possibility of rain from july 18th

Telangana Rains: తెలంగాణని అతలాకుతలం చేసిన వరుణుడు కాస్త బ్రేక్​ తీసుకున్నాడు. సుమారు వారం రోజులుగా ఎడతెరపిలేకుండా.. తన ప్రతాపాన్ని చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాడు. ఇప్పుడు కాస్త శాంతించినా.. మళ్లీ 18 తర్వాత విజృంభించేందుకు అవకాశమున్నట్టు సమాచారం.

బ్రేక్​ తీసుకున్న వరుణుడు..
బ్రేక్​ తీసుకున్న వరుణుడు..

By

Published : Jul 15, 2022, 9:19 AM IST

Telangana Rains: తెలంగాణలో సుమారు వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా రేగులగూడెం (జయశంకర్‌ జిల్లా), చెన్నూరు (మంచిర్యాల)లలో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. బుధవారం వరకు కొద్దిగంటల్లోనే 10 సెం.మీ.లకు పైగా కురిసిన కుండపోత వర్షాల తీవ్రత గురువారం పగలు లేదు.

శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని.. కానీ ఈ నెల 18 తరువాత మళ్లీ భారీ వర్ష సూచనలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న చెప్పారు. బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌, పాత ఎల్లాపూర్‌లలో 29.4 సెం.మీ. చొప్పున, కరీంనగర్‌ జిల్లా ఆర్నకొండలో 23, గుండిలో 21.2 సెం.మీ. వర్షం కురిసింది.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details