ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాడుతూ ఉంటే వాచిపోద్ది... జాగ్రత్త సుమీ! - Problems with Innerwears

మనలో చాలా మంది చెసే తప్పిదాలే ఇవి. బహ్య ప్రపంచానికి కనిపించవు కాబట్టి ఎప్పటి వరకైనా వాడొచ్చు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. పైకి బాగానే కనిపిస్తున్నాయి కదా ఇంకొన్ని రోజులు వాడొచ్చులే అని అనుకుంటాము. కానీ అది సరికాదు. వీటిని కొంతకాలం పాటు వాడిన తర్వాత పక్కన పేట్టేయడమే మంచింది. అతిగా వాడితే అవి ఎప్పటికైనా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. అయితే ఇంతకీ ఏమిటా వస్తువులు? వాటి కాలపరిమితి ఎంత? ఎంత కాలం పాటు వాడాలి... వాటిని ఎప్పుడు మార్చాలి?

affected helth problems to something long time
అలంకరణ సమస్యలు

By

Published : Jun 5, 2020, 6:53 PM IST

లో దుస్తులు: వీటికి చెమట ఎక్కువగా పడుతుంది. ఆరు నెలలు దాటితే వాటి రంగు, ఆకృతి కూడా దెబ్బ తింటాయి. మన శరీరం పరిమాణం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇవన్నీ గమనించుకోకుండా వాడుతూ ఉంటే... వెన్ను, భుజాలు, నడుం నొప్పి ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. వీటి అతివాడకం కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు, తీవ్ర అనారోగ్యాలకూ దారితీయొచ్చు.

దువ్వెనలు: జుట్టు పైన ఎంతో శ్రద్ధ ఉన్నా... వీటిని శుభ్రం చేసుకునే ఆసక్తి మాత్రం చాలామందికి ఉండదు. కానీ ఇవి అపరిశుభ్రంగా ఉంటే చుండ్రు, ఇతర ఇన్ఫెక్షన్లు మాడుపై దాడి చేయొచ్చు. జుట్టు బలహీనపడి రాలడం, తెగడం వంటివి జరుగుతాయి. అందుకే వీటిని గోరువెచ్చని నీళ్లు, షాంపూతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, గాలిలో ఆరబెట్టాలి. తడిగా ఉన్నవాటిని అస్సలు వాడొద్దు. దువ్వెనలను ఏడాదికి మించి వాడకపోవడమే జుట్టుకు మంచిది.

మేకప్‌ సామగ్రి: మనం రోజూ వాడే షాంపూ, పౌడర్‌, ఐబ్రో పెన్సిల్‌, లిప్‌బామ్‌... ఇలా ఏ సౌందర్య ఉత్పత్తిని అయినా సరే గడువు తేదీ ముగిశాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు. పొరబాటున వాడితే... అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఇతరులవి వినియోగించడం, వాటిని నిర్లక్ష్యంగా పడేయడం... వంటివీ చేయకూడదు.

ఇదీ చూడండి :యాపిల్​ విత్తనాలు తినేశారా? వాటిల్లో విషం ఉంటుందని తెలుసా!

ABOUT THE AUTHOR

...view details