రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు స్పూర్తిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు. కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ మీడియా సమావేశం నిర్వహించి...కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. కోర్టు ఇచ్చిన తీర్పులో అన్ని అంశాలు స్పష్టంగా ఉన్నాయని వెల్లడించారు. కోర్టు తీర్పును అర్థం చేసుకోకుండా అమలు చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేశారు.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఎలాంటి స్టే పిటిషన్ దాఖలు కాలేదని తెలిపారు. అలా వేస్తే కేసులో ఉన్న వారికి ముందస్తు నోటీసులు వస్తాయన్నారు. కానీ అలాంటి నోటీసులు తమకు అందలేదన్నారు.