సీఎం జగన్‌తో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సమావేశమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల పాల్గొన్నారు. శనివారం ఉదయం 10 గం.కు పంచాయతీ ఎన్నికల తొలి దఫా నోటిఫికేషన్ జారీ చేయాలని ఎస్ఈసీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏజీతో పాటు ముఖ్యులతో చర్చిస్తున్నారు.
సీఎం జగన్‌తో అడ్వొకేట్ జనరల్ భేటీ.. ఎన్నికల నోటిఫికేషన్‌పై చర్చ - ఏపీ ఎన్నికల నోటిఫికేషన్

jagan
17:35 January 22
ఎన్నికల నోటిఫికేషన్ దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Last Updated : Jan 22, 2021, 6:11 PM IST