ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎస్​ఈసీ కేవియెట్ పిటిషన్​ వెనుక రాజకీయ దురుద్దేశం' - ఎన్నికల కమిషన్​పై అడ్వొకేట్ జనరల్ కామెంట్స్

స్థానిక ఎన్నికలకు తిరిగి నోటిషికేషన్ ఇచ్చే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎస్​ఈసీకి సుప్రీం ఆదేశాలిచ్చిందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పారు. ప్రస్తుత పథకాలన్నీ కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసిందన్నారు.

Advocate general  comments on election commission
అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్

By

Published : Mar 18, 2020, 11:21 PM IST

మీడియాతో మాట్లాడుతున్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్

స్థానిక సంస్థల ఎన్నికలకు తదుపరి నోటిఫికేషన్ విడుదల చేసే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎన్నికల కమిషన్​ను సుప్రీంకోర్టు ఆదేశించిందని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత అభివృద్ధి పథకాలన్నింటిని కొనసాగించొచ్చని.. ఈ మేరకు సుప్రీం ఆదేశాలిచ్చిందని శ్రీరామ్ తెలిపారు. ఎన్నికల కమిషన్ వేసిన కేవియెట్ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వాదించినట్లు ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details