ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి సంబంధించిన సలహాదారును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దిల్లీలోని ఎయిమ్స్ మాజీ వైద్యుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని ప్రజారోగ్య సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగాధిపతిగా శ్రీనాథరెడ్డి పని చేశారు. రెండు సంవత్సరాల కాల వ్యవవధితో ఆయన్ను సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలిచ్చింది.
వైద్య రంగానికి సలహాదారుగా ఎయిమ్స్ మాజీ వైద్యుడు
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి సలహాదారును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఎయిమ్స్‌లో కార్డియాలజీ విభాగాధిపతిగా పని చేసిన శ్రీనాథరెడ్డిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వైద్య రంగానికి సలహాదారుగా మాజీ ఎయిమ్స్ వైద్యుడు