NREGA pending bills: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగా) మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.1,000 కోట్లు సర్దుబాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసే నిబంధనతో నిధులు కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
2021-22లో నరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున గ్రామాల్లో భవన నిర్మాణాలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యంతో బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యమై పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. తిరిగి పనులు ప్రారంభించాలంటే బిల్లుల చెల్లింపునకు తాత్కాలికంగా రూ.1,000 కోట్లు సర్దుబాటు చేయాలన్న గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.