ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాంబయ్య సాహసం.. ఆదిత్యనాథ్‌దాస్‌కు పునర్జన్మ! - ఏపీ కొత్త సీఎస్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. 2001లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోని వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో మావోయిస్టుల దాడి నుంచి ఆదిత్యనాథ్ దాస్.. తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నారు. డ్రైవర్ సాంబయ్య అప్రమత్తతే.. ఆయన ప్రాణాలు కాపాడింది. ఆనాటి సందర్భాన్ని.. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ సీఎస్ గా బాధ్యతలు తీసుకోనున్న తరుణంలో.. గుర్తు చేసుకున్నారు డ్రైవర్ సాంబయ్య.

Adityanath Das
Adityanath Das

By

Published : Dec 24, 2020, 10:35 AM IST

అది 2001 ఫిబ్రవరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ పాలక మండలి సమావేశం పూర్తైంది. ఆ కార్యక్రమానికి హాజరైన నాటి వరంగల్ కలెక్టర్ ఆదిత్యనాథ్ దాస్.. తన వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో.. మావోయిస్టులు ఆయన కారుపై రెండు వైపుల నుంచి కాల్పులు జరిపారు. భుజం నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో ఆదిత్యనాథ్ గాయపడ్డారు. ఆయన వాహనం నడిపుతున్న డ్రైవర్‌ సాంబయ్య కాలికీ బుల్లెట్లు తగిలి తీవ్ర రక్తస్రావమైంది.

ఆ పరిస్థితుల్లోనూ డ్రైవర్‌ సాంబయ్య తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. కలెక్టర్‌ ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా, గాయాన్ని లెక్కచేయకుండా కారును వేగంగా ముందుకు పరిగెత్తించారు. ఆయన ప్రాణాలను కాపాడారు. మర్నాడు సాంబయ్య సాహసాన్ని అందరూ శ్లాఘించారు. ప్రస్తుతం... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్‌ దాస్‌ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన అప్పటి దుర్ఘటన తాలూకూ జ్ఞాపకాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు. ఆదిత్యనాథ్ దాస్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details