రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. నూతన సీఎస్‌ను ఉన్నతాధికారులు, సిబ్బంది అభినందించారు. ఇప్పటివరకు సీఎస్‌గా ఉన్న నీలం సాహ్ని.. ఇవాళ్టితో పదవీ విరమణ చేస్తున్నారు. ఆమె స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదినాథ్ దాస్‌ను నియమించింది. ఆదిత్యనాథ్ ఇప్పటిదాకా నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.
సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్ - ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆదిత్యనాథ్ ఇప్పటిదాకా నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు.
సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యనాథ్ దాస్
'ఆర్థికపరమైన క్లిష్ట పరిస్థితులున్నా ప్రతి అంశానికి పరిష్కారం ఉంటుంది.సుదీర్ఘకాలంపాటు జలవనరులశాఖ బాధ్యతలు పర్యవేక్షించా. ప్రాజెక్టు పూర్తి చేయడంలోనూ నా భాగస్వామ్యం ఉంటుంది. సమస్యలను పరిష్కరించడమే అధికారులుగా మా బాధ్యత. ప్రభుత్వ ప్రాధాన్యతలే ముఖ్యం.. నాకంటూ వేరే ప్రాధాన్యతలు లేవు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి అవుతుంది' -సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
ఇదీ చదవండి: 'విపత్తు తక్షణ స్పందన దళం' వాహనాలను ప్రారంభించిన సీఎం
Last Updated : Dec 31, 2020, 5:29 PM IST