కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని.. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తన వద్దకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారి నుంచి పూలబోకేలు, స్వీట్లకు బదులుగా నోటుపుస్తకాలు, పెన్నులు, కంపాక్స్ బాక్సులను స్వీకరించారు.
ముందస్తుగానే కలెక్టర్ పిలుపునివ్వడంతో క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారంతా ఆయా వస్తువులతో తరలివచ్చారు. అధికారుల నుంచి ఇతరుల నుంచి స్వీకరిస్తున్న నోటుపుస్తకాలను పేద పిల్లలకు పంచిపెడతామని కలెక్టర్ స్పష్టంచేశారు.