ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశాల కొరకు “నన్నయ సెట్-2020” పరీక్షలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. శనివారం నన్నయ సెట్ -2020 పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ను వీసీ విడుదల చేశారు.
రాష్ట్రంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నన్నయ సెట్ 2020 పరీక్షలను ఈ నెల 16వ తేది నుంచి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని వీసీ అన్నారు. నన్నయ సెట్ కొరకు 6810 మంది విద్యార్థులు దరఖాస్తూ చేసుకున్నారని తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించామని చెప్పారు.