ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేదలకు ఆర్థిక సాయం నిధులు విడుదల

లాక్‌డౌన్‌ కారణంగా పేదలకు ఆర్ధికసాయం అదనపు మొత్తం నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. రెండో విడతలో రూ.43.28 కోట్లు ఆర్ధిక సాయంగా అందించేందుకు పాలనా అనుమతులు జారీ చేశారు.

additional financial assistance to poor in ap
పేదలకు ఆర్థిక సాయం నిధుల విడుదల

By

Published : Apr 17, 2020, 12:17 AM IST

లాక్​డౌన్ కారణంగా దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు అదనపు మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండో విడతలో రూ.43.28 కోట్లు ఆర్ధిక సాయంగా అందించేందుకు పాలనా అనుమతులు జారీ చేసింది. తొలిదశలో ఆర్థిక సాయం అందని కుటుంబాలకు ఈ మొత్తాన్ని వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. మొదటి దశలో ఉచిత రేషన్ తీసుకుని ఆర్థిక సాయం పొందని కుటుంబాలకు ఈ మొత్తాన్ని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాల్సిందిగా గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్​ను ప్రభుత్వం ఆదేశించింది. తొలిదశలో 1. 33 కోటి బియ్యం కార్డు దారులకు, 98 లక్షల పైచిలుకు రేషన్ కార్డు దారులకు ఆర్థిక సాయం పంపిణీ చేసేందుకు 133 కోట్ల రూపాయల్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details