ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Shalu Chourasiya case: నటి చౌరాసియా కేసు.. నిందితుడు బాబుపై మరో ఫిర్యాదు!

సినీ నటి షాలూ చౌరసియాపై దాడి చేసిన నిందితుడు బాబుపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. డబ్బులు ఇవ్వకపోతే లైంగికదాడికి పాల్పడతానని బెదిరించినట్లు ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది.

Shalu Chourasiya case
Shalu Chourasiya case

By

Published : Nov 21, 2021, 3:26 PM IST

సినీ నటి షాలూ చౌరసియాపై దాడికి(Attack on Shalu Chourasiya) పాల్పడిన నిందితుడు కొమ్ముబాబుపై... ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద ఈ నెల 2వ తేదీన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే లైంగికదాడికి పాల్పడతానంటూ బెదిరించాడని, తన వద్ద ఉన్న రూ. 2,500 లాక్కున్నాడని బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించారు. భయంతో పోలీసులకు అప్పుడు ఫిర్యాదు చేయలేదని చెప్పారు. నిందితుడు అరెస్ట్‌ కావటంతో రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నటి షాలూ చౌరసియాపై దాడి..

కొన్నిరోజుల క్రితం హైదరాబాద్​ నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద దుండగుడు నటి షాలూ చౌరాసియాపై దాడి చేసి పారిపోయాడు. ఘటనను సీరియస్​గా తీసుకున్న పోలీసులు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలించారు. నటిపై దాడి (Shalu Chourasiya case details) చేసిన తర్వాత నిందితుడు కేబీఆర్ పార్క్ పరిసరాల్లో సుమారు నాలుగు గంటల పాటు ఉన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా అతని కదలికలను గమనించారు. నటికి పరిచయస్తులే దాడి (Shalu Chourasiya incident) కి పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ జరిపారు. ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి.. అరెస్ట్ చేశారు.

కేసు వివరాలు చెప్పిన అంజనీ కుమార్

కేబీఆర్ పార్కులో నటి షాలూ చౌరాసియాపై దాడి కేసును(Shalu chourasiya case news) పోలీసులు ఛేదించారు. ఈ నెల 14న చౌరాసియాపై లైంగిక దాడి చేసేందుకు నిందితుడు ప్రయత్నించాడని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్న కొమ్ము బాబు.. దోపిడీకి ప్రయత్నించి.. అసభ్యంగా ప్రవర్తించాడని అంజనీ కుమార్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కుల్కచర్లకు చెందిన బాబు.... మూడేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. సినిమా సెట్స్‌లో సహాయ కార్మికుడిగా చేసేవాడని పేర్కొన్నారు. కరోనా సమయంలో పనులు లేక సొంతూరుకు వెళ్లిన బాబు ఆర్నెళ్ల క్రితం నగరానికి వచ్చి రోజువారి కూలిపని చేస్తున్నాడు. డబ్బులు సరిపోకపోవడతంతో దోపిడీలు చేయడం మొదలుపెట్టాడని సీపీ తెలిపారు. బాబుకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.

గత నేర చరిత్ర..

2019 డిసెంబర్‌లో గోల్కొండ పీఎస్ పరిధిలో చరవాణి చోరీ కేసులో బాబు జైలుకు వెళ్లొచ్చాడని వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలోనూ కేబీఆర్ పార్కులో ఓ మహిళ చరవాణి లాక్కునేందుకు ప్రయత్నించగా... ప్రతిఘటించి అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకుంది. నటి చౌరాసియాపై దాడి ఘటనలోనూ నిందితుడు ఆమె చరవాణి లాక్కొని ఇందిరానగర్ సమీపంలో స్విచాఫ్ చేశాడు. పోలీసులు యూసూఫ్ గూడ, కృష్ణానగర్, బంజారాహిల్స్ కు చెందిన దాదాపు 80మంది పాతనేరస్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించి నిందితుడు బాబును అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:

తెలంగాణ​ స్పీకర్‌ పోచారం మనవరాలి వివాహం.. హాజరైన జగన్, కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details