లేడీస్ టైలర్ సినిమాకు డార్లింగ్ పాటను పాడిన ఎస్పీబీ... ఆ పాట అనంతరం తనకు కొన్ని వందల పాటలు పాడారని గుర్తు చేసుకున్నారు సినీనటుడు రాజేంద్రప్రసాద్. తన చిత్రాల్లో ఎన్నో మరుపురాని పాటలు పాడిన బాలు... ఇంత త్వరగా వెళ్లిపోతారని ఊహించలేదని రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు.
" మనిషి జీవితంలో రెండే గుర్తుంటాయి. ఒకటి పెళ్లి, రెండు చావు. ఈ రెండింటికి సంబంధించిన అద్భుతమైన పాటలు నాకు పాడారు. మమ్మల్ని వీడి వెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు."