రాష్ట్రంలో నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమంపై హీరో చిరంజీవి స్పందించారు. ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై, వైద్య సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
Chiranjeevi: సీఎం జగన్ నాయకత్వం స్ఫూర్తిదాయకం: చిరంజీవి - సీఎం జగన్కు చిరంజీవి వ్యఖ్య
రాష్ట్రంలో ఒక్కరోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కరోనా భూతాన్ని ఓడించగలమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోందని అన్నారు.
chiranjeevi on vaccination at ap
'ఆంధ్రప్రదేశ్ వైద్య సిబ్బంది ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ఓ గొప్ప పని.. నాకు చాలా సంతోషం ఉంది. వైద్య సిబ్బంది కృషి ఫలితంగా కరోనా భూతాన్ని ఓడించగలమనే విశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది. ఈ ప్రయత్నాలను కొనసాగించాలి. సీఎం జగన్ స్ఫూర్తిదాయక నాయకత్వానికి సీఎం జగన్కు నా అభినందనలు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:
అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్ చేయూత: సీఎం జగన్
Last Updated : Jun 22, 2021, 3:00 PM IST