Chiranjeevi: హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. ఆయన మాతృమూర్తి అంజనాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా జీవితమని.. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందగా ఉందని చిరంజీవి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో మహనీయులను కన్న మాతృమూర్తులను సర్మించుకొని, వారికి నివాళులు ఆర్పించడం కనీస ధర్మంగా భావిస్తున్నానని చెప్పారు.
ఆ మాతృమూర్తులను స్మరించుకోవడం కనీస ధర్మం - Chiranjeevi latest news
Chiranjeevi ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈ వేడుకలని సినీ నటుడు చిరంజీవి అన్నారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
Chiru
"75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవ పండుగ చేసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, మహానీయుల త్యాగం వల్లే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. స్వాతంత్య్ర సమరంలోకి వెళ్లండి అంటూ ధైర్యంగా పంపించిన నాటి కన్న తల్లులను కొనియాడాలి. అలాంటి కన్నతల్లులను స్మరించుకొని నివాళులు ఆర్పించడం కనీస ధర్మంగా భావిస్తున్నాను.- చిరంజీవి
Last Updated : Aug 15, 2022, 12:46 PM IST