కరోనా ఉద్ధృతి ఉన్న హాట్ స్పాట్ ప్రాంతాల్లో అధికారులు, స్థానికులతో కలిసి సంయుక్త కార్యాచరణ కమిటీలు వేస్తున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. ఈ కమిటీలు... హాట్ స్పాట్ ప్రాంతాల్లోని ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పిస్తాయని చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షలు, క్వారంటైన్ కేంద్రాలపై ప్రజల్లో ఉన్న అపోహలను జాయింట్ యాక్షన్ కమిటీలు పారదోలేందుకు కృషి చేస్తాయని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
రేపటి నుంచి ఈనెల 27 వరకు ...12 రోజుల పాటు నిత్యావసరాల పంపిణీ జరుగుతుందని... ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. రేషన్ సరకుల పంపిణీకి ప్రస్తుతమున్న డిపోలతోపాటు అదనంగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.