ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు సాయం చేయండి' - achennnaidu serious on ys jagan

లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున సహాయం అందించాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి.. వారికి ఏ మాత్రం సరిపోవడం లేదని అన్నారు.

achennnaidu comments on helping the poor people by govt over  thousand rupess distribution
achennnaidu comments on helping the poor people by govt over thousand rupess distribution

By

Published : Apr 11, 2020, 3:04 PM IST

అచ్చెన్నాయుడు ట్వీట్

కరోనా దృష్ట్యా కేంద్రం నుంచి రాష్ట్రానికి 10 వేల కోట్లు వస్తుంటే.. ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు ఇచ్చేందుకు సీఎం జగన్‌కి మనసొప్పడం లేదని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులకు పంట పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని మండిపడ్డారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు... అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రూ. వెయ్యి... ఏ మాత్రం సరిపోవని అభిప్రాయపడ్డారు. కనీసం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలంటూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details