ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిజాలు బయటపడతాయనే భయంతో వైకాపా నేతలకు నిద్రపట్టడంలేదు' - latest news on chandra babu amaravathi tour

చంద్రబాబు అమరావతి పర్యటనలో ప్రజల సమక్షంలో వైకాపా చర్యలు ఎండగడతారని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు పర్యటనలో నిజాలు నిగ్గుతేలుతాయనే భయంతో మంత్రులకు నిద్ర కరవైందన్నారు.

చంద్రబాబు అమరవాతి పర్యటనపై అచ్చెన్నాయుడు

By

Published : Nov 25, 2019, 7:26 PM IST

ఈనెల 28న చంద్రబాబు అమరావతి పర్యటనలో.. ప్రజల సమక్షంలో వైకాపా భాగోతాలను ఎండగడతారని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని పనులను అటకెక్కించారని మండిపడ్డారు. అమరావతికి గెజిట్‌ లేదని, మ్యాప్‌లో చోటు లేదని వైకాపా నేతలు రోజుకో దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటనలో నిజాలు నిగ్గుతేలుతాయనే భయంతో మంత్రులకు నిద్ర కరవైందని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details