ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల బహిష్కరణపై వైకాపాకు మాట్లాడే అర్హత లేదు: అచ్చెన్న - అచ్చెన్నాయుడు తాజా వార్తలు

ప్రతిపక్షంలో ఉండగా అనేకసార్లు ఎన్నికల్ని బహిష్కరించిన వైకాపాకు.. తెదేపా గురించి మాట్లాడే హక్కులేదని తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Achennayudu
అచ్చెన్నాయుడు

By

Published : Apr 2, 2021, 8:08 PM IST

ప్రతిపక్షంలో ఉండగా అనేకసార్లు ఎన్నికల్ని బహిష్కరించిన వైకాపాకు.. తెదేపా గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. మూడేళ్లు అసెంబ్లీని బహిష్కరించటంతోపాటు 2013లో ఎమ్మెల్సీ ఎన్నిక, కొన్ని జిల్లాల్లో సహకార ఎన్నికలు, 2015లో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక, 2018లో తెలంగాణ ఎన్నికలను వైకాపా బహిష్కరించిందని ఆయన మండిపడ్డారు.

9 ఏళ్ళుగా సీబీఐ విచారణను కూడా బహిష్కరిస్తున్న విజయసాయి రెడ్డి, ఇప్పుడు బిల్డప్ ఇవ్వటం అసహ్యంగా ఉంటుందని ట్విట్టర్​లో దుయ్యబట్టారు.

అచ్చెన్నాయుడు ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details