అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అచ్చెన్నాయుడు కోర్టును కోరారు. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్ పై తీర్పు రేపు వచ్చే అవకాశం ఉంది.
అచ్చెన్నాయుడి పిటిషన్ పై విచారణ.. రిజర్వ్‌లో తీర్పు - news on achennaidu
ప్రైవేటు హాస్పిటల్ కి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో అచ్చెన్నాయుడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ధర్మాసనం తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది.
హైకోర్టులో అచ్చెన్నాయుడి పిటిషన్
అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన తరుపు న్యాయవాది అన్నారు. అనారోగ్యంతో ఉన్న అచ్చెన్నాయుడికి సహాయకుడు అవసరమని వాదించారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం అవరమయ్యే ఖర్చులు అచ్చెన్నాయుడే భరిస్తాడని కోర్టుకు తెలిపారు.
ఇదీ చదవండి: రఘురామకృష్ణరాజుపై లోక్‌సభ స్పీకర్‌కు వైకాపా ఫిర్యాదు!