టెలీ ఈఎస్ఐ కొనుగోళ్లల్లో అవకతవకల అభియోగాలపై అరెస్టైన అచ్చెన్నాయుడిని.. అనిశా అధికారులు తొలిరోజు 3గంటలపాటు విచారించారు. అనిశా డీఎస్పీలు ప్రసాద్, చిరంజీవి ఇతర సిబ్బంది గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో.. అచ్చెన్న చికిత్స పొందుతున్న జీజీహెచ్‌కు వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాకర్‌ను కలిసి.... అచ్చెన్నను కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్నిఅందజేశారు. ఆ తర్వాత అచ్చెన్న చికిత్స పొందుతున్న గదికి వెళ్లిన అధికారులు.. న్యాయవాది, వైద్యురాలి సమక్షంలో సాయంత్రం 4 గంటల 50 నిమిషాల నుంచి రాత్రి 8 వరకూ 3గంటలకుపైగా విచారించారు. టెలీహెల్త్ సర్వీసెస్ వ్యవహారంపై ప్రధానంగా.. ప్రశ్నించారు. ఓ కంపెనీని సిఫారసు చేస్తూ సంతకం చేయడమంటే ఆ సంస్థకే టెండర్లు ఇవ్వాలని చెప్పడమే కదా అని అడిగారు. ఐతే... ఆ కొనుగోళ్లు జరిగే సమయానికి తాను సంబంధిత శాఖా మంత్రిగా లేనని అచ్చెన్న జవాబిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో వాటి అమలు ఎలా ఉందో అధ్యయనం చేయాలని మాత్రమే సూచిస్తూ.. మినిట్స్‌పైనే సంతకం చేశానన్నారు. మినిట్స్ అంటే ఏంటి? టెండర్లు ఓకంపెనీకే ఇవ్వాలని సిఫార్సుచేయడం వల్ల మీకు బాగానే లబ్ధి చేకూరింది కదా? కొనుగోళ్ల నాటికి మంత్రిగా లేకున్నా... ప్రభావితం చేశారు కదా? మీలో ఏ లక్షణాలు చూసి చంద్రబాబు.. మంత్రి పదవి ఇచ్చారు? ఆయనతో మీకున్న సంబంధాలేంటి? మీ భార్య నుంచి సంక్రమించిన ఆస్తులేంటి? ప్రస్తుతం మీ ఆస్తులు, ఆదాయం, అప్పుల వివరాలేంటి?' అంటూ అచ్చెన్నపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ, రేపు కూడా విచారణ కొనసాగనుంది.
అనారోగ్యంతో ఉన్నా...