గమ్యం చేరే లోపే గతించేలా రాష్ట్ర రహదారులు తయారయ్యాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతికి ప్రతిరూపాలుగా మారిన జగనన్న గుంతలపై ప్రజలు రోడ్డెక్కేందుకు భయపడుతున్నారని అన్నారు.
రహదారుల దుస్థితిపై సీఎం జగన్ దృష్టి సారించాలి: అచ్చెన్నాయుడు - achennaidu comments on road condition in ap
రెండేళ్లుగా రహదారులకు మరమ్మతులు లేకపోవటం ప్రజల పాలిట శాపంగా మారిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అధ్వానంగా మారిన గ్రామీణ, పట్టణ రహదారుల దుస్థితిపై సీఎం జగన్ తక్షణమే దృష్టి సారించి మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
"రెండేళ్లుగా రహదారులకు మరమ్మతులు లేకపోవటం ప్రజల పాలిట శాపంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రహదారుల నిర్మాణాల పేరుతో వైకాపా ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. ప్రాణాలపై ఆశలు వదులుకునేలా ప్రయాణాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. గుంతల రహదారులు, అడుగుకో అవినీతి అక్రమం తప్ప రెండేళ్లుగా వైకాపా చేసిందేంటి. అయిన వారికి రాష్ట్ర సంపద దోచిపెట్టాలనే ధ్యాస తప్ప రహదారుల నిర్వహణకు ఖర్చు చేసింది శూన్యం. అస్తవ్యస్తంగా మారిన గ్రామీణ, పట్టణ రహదారుల దుస్థితిపై సీఎం జగన్ తక్షణమే దృష్టి సారించి మరమ్మతులకు నిధులు విడుదల చేయాలి. ఇప్పటి వరకు చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి." అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: