వైకాపా అరాచకాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో మాజీ సర్పంచ్ రామస్వామిని చంపాలని యత్నించారని ఆరోపించారు. అర్ధరాత్రి కత్తులు, రాళ్లతో రామస్వామిని చంపాలని యత్నించారని దుయ్యబట్టారు. రామస్వామిపై దాడికి యత్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం ఉందనే అహంతో చేస్తున్న ఈ దాడులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
'వైకాపా అరాచకాలు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి' - తెదేపా నేతలపై వైకాపా వ్యాఖ్యలు
చిత్తూరు జిల్లా కృష్ణాపురంలో మాజీ సర్పంచ్ రామస్వామి ఇంటిపై వైకాపా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అధికారo ఉందనే అహంతో చేస్తున్న ఈ దాడులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
achennaidu comments on cm jagan
ఇదీ చదవండి:
అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్