వైకాపా పాలనలో ప్రజలకు రక్షణ లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. హత్యలు, విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో తెదేపా నేతల హత్యపై విచారం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతో తెదేపా నేతలు, కార్యకర్తలను బలిగొంటున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. అభివృద్ధిని గాలికొదిలి కక్షలు, కార్పణ్యాలతో కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా దిగజారిందనటానికి ఈ హత్యలే ఉదాహరణ అని అచ్చెన్నాయుడు అన్నారు
'హత్యలు, విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు' - achennaidu on kurnool tdp leaders murder
రాజకీయ కక్షలతో తెదేపా నేతలు, కార్యకర్తలను బలిగొంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కర్నూలు జిల్లాలో తెదేపా నేతల హత్యపై విచారం వ్యక్తం చేశారు.
achennaidu comments on ysrcp government rule